వైరల్ వీడియో; హార్దిక్ పాండ్యా లిప్ లాక్…!

-

అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వెంటనే బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకున్న టీం ఇండియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా తన టాలెంట్ బయటపెడుతునే ఉన్నాడు. గత కొన్ని రోజులుగా జట్టుకి దూరంగా ఉన్న ఈ యువ ఆల్ రౌండర్ ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లో స్టార్ ఆటగాడిగా గుర్తింపు వచ్చినప్పటి నుంచి కూడా హార్దిక్,

ప్రేమాయణాలు మొదలుపెట్టాడని, తనకు స్టైల్ తో పాటు అమ్మాయిలు అన్నా ఆసక్తే అంటూ పలువురు విమర్శలు కూడా చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సెర్బియా నటి నటాషా స్టాన్‌కోవిచ్‌తో అతను రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. నటాషాతో ఎంగేజ్‌మెంట్ అయిన వార్తను స్వయంగా పాండ్యా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఓ ప్రైవేటు బోటులో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. నటాషా చేతికి రింగ్ ధరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. పాండ్యా తనకు రింగ్ తొడిగిన తర్వాత…హార్ధిక్ కి లిప్ లాక్ ఇచ్చింది నటాషా… దీనికి సంబంధించిన వీడియో ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాదాపు 6.60 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అటు లైకులు కూడా భారీగానే వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version