తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు అసలు సినిమా ఉంటది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేశారు .అయినప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
కాగా.. మిమ్మల్ని హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అందరం కష్టపడాలి. ఫిబ్రవరి నెలలో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉంటారు.ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తామని ఆయన అన్నారు. మరోవైపు.. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ,వారిది వారికే పడటం లేదని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా.. కార్యకర్తల కోసం ట్రస్టు ఏర్పాటు చేసి అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని తెలిపారు. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.