తెలంగానం : ఓరుగ‌ల్లు వాకిట వ‌రాల జ‌ల్లు .. ఓవ‌ర్ టు హ‌రీశ్

-

అభివృద్ధి మాత్ర‌మే మాట్లాడాలి
మాటలు కాదు చేత‌లు కావాలి
స్ఫూర్తిదాయ‌క పాల‌న‌కు చేత‌లు మాత్ర‌మే
ప్రామాణికం అయి ఉంటాయి
ఇదే అంటున్నారు కేసీఆర్ అదే నిజం చేస్తున్నారు హ‌రీశ్

నీళ్లు, నిధులు , నియామ‌కాలు అన్న‌వి ప్ర‌ధాన అజెండాగా ఆ రోజు ఉద్య‌మం సాగితే, ఇప్పుడు ఆరోగ్యం, ఆనందం, సంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ అన్నవి నినాదాల‌కు ఆన‌వాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రంగాల అభివృద్ధి ఊతం ఇస్తూ ఉన్నారు తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు.. ఒక‌టి వైద్యం వైద్య రంగానికి అనుసంబంధానంగా ఉండే విద్యా రంగం వీటికి అనుసంధానంగా ఉండే ప‌రిశోధ‌న రంగం కూడా ! ప్రాధాన్య రంగాల్లో ఒక‌టిగా నిలుస్తూ సంబంధిత ప్రోత్సాహ‌కాలు అందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణాన మ‌రికొన్ని అభివృద్ధి ప‌నులు వేగవంతం చేసే ప‌నిలో కేసీఆర్ శ్రేణులు ఉన్నాయి. విప‌క్ష పార్టీల వివ‌క్ష పూరిత విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు, అందుకు త‌గ్గ విధంగా దీటుగా రాణించేందుకు సిద్ధం అవుతున్నాయి. అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ‌ను అటు హ‌రీశ్., ఇటు కేటీఆర్ షురూ చేశారు. ఇప్పుడు ఫోక‌స్ అంతా ఒక్క హైద్రాబాద్ పైనే కాదు వ‌రంగ‌ల్ పై కూడా ! పోరు గ‌డ్డ ఓరుగ‌ల్లు సాక్షిగా ఈ ప్రాంతానికి మ‌రిన్ని అభివృద్ధి వెలుగులు ఇచ్చేందుకు తాము స‌మాయ‌త్తం అవుతున్నామ‌ని హ‌రీశ్ రావు తెలిపారు. దీన్నొక హెల్త్ సిటీగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

హైద్రాబాద్, వ‌రంగ‌ల్, సిద్ధిపేట తో స‌హా ఇత‌ర ముఖ్య న‌గరాల‌కు ఇంకొన్ని వ‌స‌తులు ముఖ్యంగా వైద్య రంగం ప‌రంగా ఊతం ఇచ్చేందుకు సంబంధిత శాఖ‌ను చూస్తున్న మంత్రి హ‌రీశ్ త‌న ప్రాధాన్యాల‌ను పెంచారు. ఇంకా చెప్పాలంటే విస్తృతం చేశారు అని రాయాలి. ఈ క్ర‌మంలో ప్రపంచంలోని అన్ని రకాల వైద్యసేవలను అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వరంగల్‌ నగరాన్ని ఆరోగ్యనగరంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.1200 కోట్ల ఖర్చుతో వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని వివరించారు. అనంతరం వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన పనులను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version