కేంద్రమంత్రులకు సీఎం జగన్‌ లేఖలు..

-

కేంద్రమంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ లేఖలు రాశారు. వంట నూనెలకు కొరత నేపథ్యంలో ఆవ నూనె పై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి జగన్.. రష్యా ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందన్నారు. ఆవనూనె దిగుమతుల పై దిగుమతి సంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందన్నారు సీఎం.

దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందన్నారు. ఈ ప్రభావం వినియోగదారుల పై పడిందని, దీని వల్ల సన్‌ఫ్లవర్‌తో పాటు, ఇతర వంట నూనెల ధరలు పెరిగాయని, రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని ఆయన విన్నవించారు. ప్రస్తుతం ముడి ఆవనూనె పై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందని, దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని, కనీసం ఏడాది పాటు ఆవనూనె దిగుమతి పై సుంకాలను తగ్గించాలని జగన్‌ లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version