టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ స్థానంలో స్పిన్నర్ హర్‌ప్రీత్ బరార్ జట్టులోకి వచ్చాడు. కానీ.. బెంగళూరు తుది జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.

తాజా సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడింట్లో విజయం సాధించి.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లాడి కేవలం ఐదింట్లో మాత్రమే గెలిచింది. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసులో నిలవాంటే ఈరోజు మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version