బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు డబ్బు పంచుతూ అడ్డంగా దొరుకుంతోందని, హరీష్ రావు నైతిక ఓటమిని ఒప్పుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుడిమాండ్ చేశారు.హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పఠాన్ చెరు నియోజకవర్గాల పరధిలో ఓటమిని ఒప్పుకొని నోటుకు 500, 1000 చొప్పున డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నారని ఆయన ఆరోపించారు .
పోలీసులకు చెప్పినా కూడా ఒక్కో చోటుకు వెళ్లడానికి గంట సమయం తీసుకుంటున్నారని , దీన్ని బట్టి మెదక్ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థిని అయిన తాను గెలిచినట్లు తేటతెల్లం అయ్యిందన్నారు రఘునందన్ రావు. ఓటర్లకు డబ్బు పంచడానికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని చాలా స్పష్టంగా అర్ధం అవుతుందని మండిపడ్డారు.సిద్దిపేటలో ఆయన కంటే మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు తెలిసి సర్పంచులకు, ఎంపీటీసీలను పిలిచి డబ్బు పంచుతున్నారని చెప్పినా పోలీస్ వారి చర్యలు కనిపించడం లేదన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్యాలెట్ బాక్సులు సీల్ అయ్యేంత వరకు సంయమనాన్ని పాటించాలని,వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును ఆపలేరని అన్నారు.దీనిపై ఎన్నికల అధికారులకు పోలీస్ యంత్రాంగానికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశామని ఆయన వెల్లడించారు.