గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులపై దాడులు చేస్తే..తాట తీస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. అశోక్ నగర్ లో నిరుద్యోగులు చేసిన నిరసనలపై హరీష్ రావు స్పందించారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నానని తెలిపారు.
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండని పేర్కొన్నారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.