దుబ్బాకలో బీజీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ అన్నీ తానే అయి ప్రచారం చేసిన హరీష్ రావు ఈ ఓటమి గురించి స్పందించారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని ఉప ఎన్నిక ఓటమి కి బాధ్యత వహిస్తున్నానని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్న ఆయన మా లోపాలను సవరించుకుంటామని అన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అని అలానే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు. ఓటమి అందుకున్నప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన, టిఆర్ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో అండగా ఉంటామని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు, అన్ని విధాలా సహాయ సహకారాలు ఇస్తూ, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు.