వైద్యశాఖ పై హరీష్ రావు సమీక్ష… వారందరి జీతాలు చెల్లించాలని కీలక ఆదేశాలు

-

వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌ తో ఇవాళ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్ రావు. జాతీయ స‌గ‌టును మించి తెలంగాణ రాష్ట్రం లో వ్యాక్సినేష‌న్ జరుగాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేగం మ‌రింత పెంచాల‌ని మంత్రి హ‌రీష్ రావు ఆదేశించారు.

శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు హరీష్ రావు. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 350 ప‌డ‌క‌లు గ‌ల కింగ్ కోఠి జిల్లా ద‌వాఖాన‌లో సాధార‌ణ వైద్య‌సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ‌ చేయాలని పేర్కొన్నారు. టిమ్స్ హాస్పిట‌ల్‌లో 200 ప‌డ‌క‌లు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మిన‌హా సాధార‌ణ వైద్య సేవ‌లు ప్రారంభం చేయాలని పేర్కొన్నారు. అలాగే టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లింపులు ఇవ్వాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధ‌ర్‌, డీఎంఈ ర‌మేశ్‌రెడ్డి, కాలోజీ వ‌ర్సిటీ వీసీ క‌రుణాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news