17% నుంచి 25% వరకు ధాన్యం తేమశాతం ఉన్నా కొనుగోలు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి పార్థసారథి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం జంపని కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ , మంత్రి పార్థసారథి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయి ఇంకా కోతలు స్పీడు అందుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ధాన్యం తేమశాతం 17% నుంచి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతుల మోసపోవద్దు అని కోరారు. రైతుల దగ్గర్నుంచి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. మిల్లర్లు ఎవరైనా సరే తేమశాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లలు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో వారితోపాటు మిల్లర్లు కూడా ఒకళ్ళు అందుబాటులో ఉండి తేమశాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసిపి హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన ఆరు ఏడు నెలలకు గాని డబ్బులు రైతులు ఎకౌంట్లో పడేవి కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాట్లు తెలిపారు.