తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30 వేలఉద్యోగాలను భర్తీ చేశామని.. త్వరలోనే మరో 50 నుంచి 60వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి ?గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. అక్కడి అభివృద్ధికుంటుపడుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనమా…. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలని తెలిపారు.
దళిత బందు హుజూరాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని.. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారని మండిపడ్డారు. బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలని.. హుజూరాబాద్ లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని చురకలు అంటించారు.
రైతు బందును హుజూరాబాద్ లో మొట్టమొదటి గా ప్రారంభిస్తే ఆనాడు ఈటల చప్పట్లు కొట్టారని…అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బందు ప్రారంభిస్తామని సీఎంగారు ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు.కొద్ది మంది బీజేపీ నేతలు ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశారని ఫైర్ అయ్యారు. తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం పై ఒత్తిడి తెస్తున్నారని… దీనివల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వీరి ఆశ అని నిప్పులు చెరిగారు.