రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 475 మంది రైతులు ఆత్మహత్య – హరీష్

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరదలు, రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. గతంలో నువ్వు చనిపోయిన వారి లిస్టు అడిగితే.. గంట సేపట్లోనే లిస్టు పంపితే ఒక్క రైతును కూడా నువ్వు ఇప్పటి వరకి ఆదుకోలేదని ఆగ్రహించారు.

harish rao vs revanth

రైతు రుణమాఫీ జరగలేదని సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని… నా చావు కు కారణం క్రాప్ లోన్ అవ్వక పోవడం అని సూసైడ్ నోట్ రాశారని తెలిపారు. తన తల్లి కి తనకి కలిసి ఉన్న రేషన్ కార్డు ఉండడం వల్ల రుణమాఫీ కాలేదని… బ్యాంక్ మేనేజర్ రుణమాఫీ జరగదు అని చెప్పడంతో బాధ పడ్డాడని వివరించారు. ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడని… ప్రభుత్వం రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పింది.. కానీ అది అవాస్తవం అన్నారు హరీష్‌ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news