పాకిస్తాన్‌కు గంభీర్ లాంటి కోచ్ కావాలి : పాక్ మాజీ క్రికెటర్ కనేరియా

-

టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఇటీవల గౌతమ్ గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. అంతకుముందు గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు. గంభీర్ కఠినమైన కోచింగ్‌ కారణంగా కేకేఆర్ జట్టు లాస్ట్ సీజన్‌లో టోర్నమెంట్ విజేతగా నిలిచింది. అటు రాహుల్ ద్రవీడ్ పదవీకాలం పూర్తవడంతో గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ నియమించింది.గంభీర్ మెంటార్ షిప్‌లో టీమిండియా రాబోయే ప్రపంచకప్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలాఉండగా, పాకిస్తాన్ జట్టుకు గంభీర్ లాంటి కోచ్ కావాలని, అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బాగుపడుతుందని ఆ దేశ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అన్నారు. అలాంటి వారే తమ క్రికెట్ పతనాన్ని అడ్డుకోగలరని చెప్పారు. ‘గంభీర్ ముక్కుసూటి మనిషి. ఆయనకు వెన్నుపోటు పోడవడం రాదు.. కోచ్ అంటే అలానే ఉండాలి. తమ క్రికెట్ బోర్డు ఎన్ని మార్పులు చేసినా లాభం లేకుండా పోతోంది. ఆటగాళ్లు లెక్కలేనితనంతో ఉన్నారు’ అని కనేరియా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news