ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హరీష్ శంకర్ వీలు దొరికినప్పడల్లా ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్లి తన సినిమా గురించి పవన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారట . రీమేక్ అని భీమ్లా నాయక్ తీస్తే హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అందుకోలేక పోయింది. గతంలో సొంతంగా రాసిన కథ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక మళ్లీ రీమేక్ అని టీవీ లో ఎన్నో సార్లు అరిగిపోయిన రికార్డు లా వేసిన తేరి ని తీస్తే ఎలా అని గోల గోల చేస్తున్నారు.
అయినా కూడా ఈ సినిమా కోసం పవన్ ముందుకే వెళుతున్నారట. ఈ సినిమా కోసం ఆదివారం(డిసెంబర్ 11)న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తేరి రీమేక్ చేయాలని మేకర్స్, పవన్ అనుకుంటున్న నేపథ్యంలో హరీష్ కి ఛాయిస్ లేదు. ఇక ఫ్యాన్స్ నిరసనలు దృష్టిలో ఉంచుకొని తేరి రీమేక్ టైటిల్ గా భవదీయుడు భగత్ సింగ్ ఉంచుతారని అంటున్నారు. ఈ మధ్య సినిమా ఫెయిల్ ఐతే డైరక్టర్ మీదనే తప్పు నెడుతున్నారు. హరీశ్ శంకర్ ఈ విషయంలో గట్టిగా ఇరుక్కున్నాడు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.