టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్..ప్రజెంట్ తన ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. జనసేనాని ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక హరీశ్ శంకర్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వేలో పంచులు వేస్తుంటారు. వివిధ విషయాలపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా అదిరిపోయే వీడియో ఒకటి షేర్ చేసి ట్విట్టర్ నయా సీఈవో ఎలన్ మస్క్ కు ఓ సూచన చేశారు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా న్యూ పాలసీలను మీరు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు హరీశ్ శంకర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సదరు ట్వీట్ లో హరీశ్ శంకర్ ప్రియమైన ఎలన్ మస్క్ అని సంబోధించారు. ‘‘వెల్ కమ్ టు ట్విట్టర్ ..శుభ మంగళవారం’’..అంటూ వీడియో షేర్ చేశారు.
ఆ వీడియోలో ‘‘ఆంటీ కూతురా..హలో అప్సరా’’ అనే మెగాస్టార్ చిరంజీవి సాంగ్ ను పేరడీ చేసి ఇద్దరు సింగర్స్ మరోలా పాడారు. మగ, ఆడ గొంతులో ఉన్న ఆ పాట హై పిచ్ లో వెరీ డిఫరెంట్ గా ఉందండోయ్..ముఖ్యంగా లేడీ సింగర్ వాయిస్ లో ఆ హై పిచ్ అదిరిపోయింది. ఆ పాట ఇక్కడ మీరూ వినేయండి..
Dear Elon musk a part from freedom of speech hope u also consider freedom of singing with ur new policies …. Welcome to twitter !!!
Happy Tuesday guys!! pic.twitter.com/F6XIoZ4U8P— Harish Shankar .S (@harish2you) April 26, 2022