హర్యానా అల్లర్లపై స్పందించిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ … !

-

గత వారం రోజులుగా హర్యానా రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం వాటిల్లింది. కాగా ఈ అల్లర్లపై ఈ రోజు సుప్రీం కోర్ట్ చాలా సీరియస్ గా హర్యానా, ఢిల్లీ, యూపీ మరియు కేంద్ర పోలీసులకు నోటీసులు ఇచ్చింది. వీలైనంత త్వరగా హర్యానాలో అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చి, పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావాలని ఆదేశించారు. కాసేపటి క్రితమే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పరిస్థితులపై స్పందించారు. సీఎం మాట్లాడుతూ ఈ హింస వలన రాష్ట్రంలో అమాయకులు ఆరు మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఈ అల్లర్లకు సంబంధించి కారకులు అయిన 116 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంకా ఈ హింస వలన ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఆస్తులకు నష్టం కలిగింది.

దీనికి కారణమైన ఏ ఒక్కరినీ ఊరికే వదలము .. నష్ట పరిహారాన్ని మొత్తం వారి నుండే రాబడుతామని సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నూహ్ ప్రాంతంలో బాధితుల కోసం కొత్తగా పధకాన్ని తెస్తున్నామని సీఎం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news