సామర్లకోటలో వందేభారత్‌కు హాల్టింగ్

-

సామర్లకోటలో వందేభారత్కు హాల్టింగ్ సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలుకు అదనపు హాల్టింగ్ సౌకర్యం
కల్పించారు. రేపటి నుంచి సామర్లకోట జంక్షన్లో రైలు ఆగనుండగా.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఉ.7.14కు నిమిషం పాటు ఆగనుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయంలో రా.9.34కు నిమిషం పాటు ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా స్టాపింగ్ ఇచ్చారు. ఈ రైలు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖలో ఆగుతుంది.

Vande Bharat Express - Wikipedia

ఇటీవ‌ల కాలంలో కాకినాడ ఎంపీ వంగా గీత కూడా రైల్వే శాఖ మంత్రిని క‌లుసుకుని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ట్రైన్ హాల్టులు పెంచాల‌ని కోరారు. ముఖ్యంగా ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా లో ఎక్కువ‌గా దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తులు సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, విశాఖప‌ట్నం వంటి కేంద్రాలలో ఉన్న రైల్వేస్టేష‌న్ల‌లలో దిగి అక్క‌డి నుండి బస్సు, మ‌రేదైమ‌నా వాహ‌నం ద్వారా కాకినాడ జిల్లాకు రావాల్సి ఉంటుంది. ఇందులో పిఠాపురం, అన్న‌వ‌రం, తుని ప్రాంతాల‌కు చాలా రైళ్లుకు సంబంధించి హాల్టులు లేవు. తాజా రైల్వేశాఖ అనూహ్య‌మైన నిర్ణ‌య‌మైతే తీసుకుంద‌నే చెప్పాలి. ఇక్క‌డ ముఖ్యంగా కాకినాడ జిల్లా వాసుల‌కైతే ఇది గొప్ప వ‌ర‌మ‌నే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news