ఇతను ఓ పోలీస్..! కష్టపడి ఎస్సై గా ఉద్యోగం సంపాదించాడు.. కొన్నాలకు వ్యసనాలు అలవాటయ్యాయి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలువెతికాడు. చెడ్డ దార్లు తొక్కాడు, ముద్దాయిలకు సహాయపడ్డాడు దోపిడీలు, దొంగతనాలు దగ్గరుండి చేయించాడు, పోలీసులకే తెలియకుండా చోరీ సొత్తును విక్రయించడంలో సహాయాపడ్డాడు చివరికి అదే పోలీసులకు దొరికిపోయాడు అతనే.. హర్యాణాకు చెందిన అస్లుప్ జైలు నుండి విడుదల అవ్వగానే మళ్ళీ అదే బాట.. అదే పాట, కానీ ఈసారి క్రైమ్ నే తన వృత్తిగా ఎంచుకొని అంచలంచాలు ఎదిగాడు అలా ఎదుగుతూ 8 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోయాడు. హర్యానాకు చెందిన ఈ వ్యక్తి హరియాణ టూ హైదరబాద్ అలా 8 రాష్ట్రాల్లో కార్య కలపాలు చేశాడు 8 రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకున్నాడు. ఎట్టకేలకు సీఐఏ పోలీసులకు చిక్కాడు, పోలీసులు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు.
ఇతని మీద ఇప్పటికే 24 కేసులు నమోదయ్యాయి, కాగా ఇతని మార్కెట్ హైదరాబాద్‌తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో విస్తరించి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే హైదరబాద్ లో కూడా ఎన్నో క్రైంస్ చేసిన ఇతనిపై పోలీసుల వద్ద ఎలాంటి కేసు నమోదు అవ్వకపోవడం..! ఇక అతని క్రైమ్ కలాపాల సంఖ్య పెరిగుతుండటంతో ఛాలెంజ్ గా తీసుకున్న హర్యాణా సీఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అస్లుప్‌పై నిఘా ఉంచింది. గత శుక్రవారం.. ఢిల్లీ–అల్వాల్ హైవేపై ఉన్న కేఎంపీ రోడ్‌లోని రేవాసన్ హోటల్ వద్ద ఇతడిని వలపన్ని పట్టుకున్నారు. త్వరలో ఇతడికి సంబంధించి కేసులున్న ఇతర నగరాల పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నారు