నమ్మితే నమ్మండి: పార్క్ హయత్ మీటింగ్ వాదనలు ఇవి!

-

పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావుల భేటీపై తీవ్ర చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై టీవీ ఛానల్స్ లో తెగ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ విషయాలను వైకాపా, విశ్లేషకులు, ప్రజలు, మీడియా చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా అనిపిస్తుందనే వాదనలు వినిపిస్తుంటే… ఈ భేటీలో పాల్గొన్న నేతలు మాత్రం… కలిస్తే తప్పేంటి, మా ఇష్టం అంటూనే… ప్రజల నమ్మకానికి, తెలివి తేటలకు పరీక్షలు పెడుతున్నారు!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన కామినేని శ్రీనివాస రావు… తాను సుజనా చౌదరి అపాయింట్ మెంట్ అడిగి హోటల్ కి వెళ్లానని, అప్పటికే అనుకోకుండా అక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారని.. అయినా కూడా ఆయనతో మాట్లాడకుండా.. సుజనా చౌదరితో మాట్లాడుకుని వచ్చేశామని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయిన సమయంలోనే సుమారు గంటకు పైగా కామినేని అదే రూం లో ఉన్నారు. అయినా కూడా ఆయన మరేమీ మాట్లాడలేదంట.. సరికదా.. వారు మాట్లాడుకున్నవి కూడా వినకుండా, పక్కన వేరేవారితో మాట్లాడుకున్నారంట.

 

ఈ భేటీ పెద్ద విషయం కాదు.. కలుస్తాం, కలిశాం, తప్పేంటి అంటున్నారు సుజనా చౌదరి. ఈ విషయం అధిష్టాణానికి తెలుసా అంటే… ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చెప్పకుండా, కన్నా లక్ష్మీ నారాయణ చెయ్యరు.. ఆయన చెప్పకుండా కామినేని శ్రీనివాస రావు, నిమ్మగడ్డకు అనుకూలంగానో, ఏపీ సర్కారుకు వ్యతిరేకంగానో కోర్టులో పిటిషన్ వేయరు అని! అందులోనే అన్ని అర్ధాలూ ఉన్నాయని చెబుతున్నారు! అంటే… ఈ భేటీ కూడా బీజేపీ అధిష్టాణానికి తెలిసే జరిగిందనేది ఆయన పరోక్షంగా చెప్పిన మాటగా ఉందని చాలా మంది అభిప్రాయం.

 

ఒకే హోటల్ గదిలో ముగ్గురు వ్యక్తులు.. పైగా ఏ రకంగా చూసుకున్నా చాలా దగ్గరి మనుషులు. ఎందుకంటే… సుజనా చౌదరి కి నిమ్మగడ్డ పాత మిత్రుడేనని సుజనానే చెప్పడం. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తోడుగా కోర్టులో కామినేని పిటిషన్ వేయడం. సో… వీరిమధ్య ఏదో రూపంలో దగ్గరితనం ఉన్నట్లే. అలాంటి ముగ్గురు వ్యక్తులు ఒకే రూం లో కలిసినా… వీరిలో ఏ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మూడో వ్యక్తి వినలేదంట!! నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానండి.. మేము చెప్పేది ఇదే, చెప్పాలని అనుకున్నదీ ఇదే అన్నట్లుగా ఈ ఇద్దరు బీజేపీ నేతలూ స్పందిస్తున్నారు!

 

అయితే ఈ విషయాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్పందించలేదు. ఏపీ ప్రభుత్వంపై రాసిన లేఖలు.. తాను రాసినవా, కాదా అనే విషయాలు చెప్పడానికే సుమారు రెండు వారాలకు పైగ సమయం తీసుకున్న ఆయన… ఈ విషయంపై ఇప్పట్లొ స్పందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది!

Read more RELATED
Recommended to you

Latest news