వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయాలి : సీఎం జగన్‌

-

ఏపీలో భారీ వర్షాల కారణంగా నెలకొన్ని వరదలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎలాంటి సహాయం కోరినా యుద్ధ ప్రాతిపదికిన అందేలా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోందని, లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టండన్నారు. గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండని సూచించారు. అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని సిద్ధం చేయండని, వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట పెట్టాలన్నారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోండన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించండని, 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలని, రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోండని, గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version