మీరెప్పుడైనా చపాతీలు చేసే యంత్రాన్ని చూశారా..?

-

సౌత్‌ ఇండియాలో అన్నం తినే వారు ఎక్కువ, నార్త్‌ ఇండియాలో రోటీలు, పుల్కాలు, చపాతీలు తినే వారు ఎక్కువ. ఇంట్లో అయితే ఎంత మందికైనా మహిళలు చపాతులు చేస్తారు. కానీ హోటళ్లలో చేత్తో చపాతీ పిండి కలపడం, చేయడం అంటే కష్టం. అందుకే చపాతీ మిషన్స్‌ వాడతారు. మీరు ఎప్పుడైనా చపాతీ మిషన్‌ చూశారా..? పిండి అదే కలుపుతుంది, చపాతీ అదే చేస్తుంది, ఆఖరికి చపాతీలను కూడా అదా కాల్చుతుంది. చిన్న రోటీమేకర్‌ అనుకుంటారేమో.. అది కాదండోయ్.. ఇది అంతకు మించి. అసలు ఆ మిషన్‌ చేసే పని చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది.

సోషల్ మీడియాలో చపాతీలు చేసే మిషన్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో ఒకరు పెద్ద మెషిన్‌లో పిండిని పిసికి పిసికి కలుపుటకు మాత్రమే నిలబడతారు. అది కూడా తగినంత నీరు, నూనె పోయడానికి. యంత్రమే అన్ని పిసికి కలుపుతుంది. దీని తరువాత పిండిని బయటకు తీసి రౌండ్గా కత్తిరించడం నెక్ట్స్‌ ప్రాసెస్.. అంతా యంత్రం ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత మంట కింద వాటిని కాల్చడం కూడా యంత్రమే చేస్తుంది.

అదేంటో ఇలాంటి వీడియోలు చూసినప్పుడు భలే శాటిస్‌ఫ్యాక్షన్‌ వస్తుంది. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 7 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. స్కూల్‌ స్టూడెంట్స్‌ కోసం ఈ చపాతీలు చేస్తున్నట్లు అక్షయ పాత్ర కిచెన్‌ నిర్వాహకులు తెలిపారు. టెక్నాలజీ డవలప్‌ అయ్యే కొద్ది మనిషి పని చేయడం తగ్గించి మ్యానేజ్‌ చేయడానికి పరిమితం అవుతున్నాడు. దగ్గరుండి పర్యవేక్షిస్తే చాలు.. అంతా మెషిన్స్‌ చూసుకుంటారు. బట్టలు ఉతకడానికి వాషింగ్‌ మిషన్‌ వచ్చినప్పుడే అందరం ఆశ్చర్యపోయాం.. ఇప్పుడు ఆ బట్టలను మడతపెట్టే యంత్రం కూడా వచ్చేసింది. గిన్నెలు కడిగే అవసరం లేదు. దానికి కూడా ఒక యంత్రం ఉంది. ఇళ్లు ఊడ్చటానికి, క్లీన్‌ చేయడానికి అన్నింటికి పరికరాలు వచ్చేశాయి. మన దగ్గర డబ్బులు ఉండి కొనలాకానీ.. ఇళ్లే పెద్ద కర్మాగారం అవుతుంది. చిటికెలో అన్ని పనులు చక్కపెట్టేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version