ఇప్పుడు జనాలకు ఆర్ధిక కష్టాలు ఒక స్థాయిలో ఉన్నాయి. చాలా మంది ఆర్ధిక కష్టాలతో ఇప్పుడు నరకం చూసే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉండటం మనం చూస్తున్నాం. మన దేశంలో మధ్య తరగతి జీవితాలు ఎక్కువ. కుటుంబాలను నెట్టుకుని రావడం అనేది ఇప్పుడు చాలా కష్టం. అందుకే ప్రభుత్వాలు ఇప్పుడు తమకు అండగా నిలవాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
ఇక ప్రజలకు లోన్స్ ఇచ్చిన బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అన్నీ కూడా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ముత్తూట్ లాంటి సంస్థలు బంగారం తాకట్టు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ బంగారానికి అదనపు ఋణం ఇవ్వాలని, లోన్ ని ఎక్కువగా పెంచాలని భావిస్తున్నాయి. గతంలో పది గ్రాములు పెట్టుకుని 20 వేలు లోన్ ఇస్తే దాన్ని పెంచే యోచనలో ఉన్నాయి. అయితే వడ్డీ ని కూడా పెంచాలని భావిస్తున్నాయి.
గ్రాము బంగారానికి ఇచ్చే మొత్తాన్ని 600 వరకు పెంచాలని… బంగారం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదని సంస్థలు భావిస్తున్నాయి. వడ్డీ భారీగా పెంచకుండా తక్కువ మొత్తంలో పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆన్లైన్ లోనే లోన్ ఎక్కువ కావాలి అంటే వెబ్ సైట్ లోనే ఒక ఆఫర్ లా దాన్ని పాప్ అప్ ఇచ్చే యోచనలో ఉన్నారట. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.