ప్రముఖ హీరోయిన్ మాలా శ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్ గర్ల్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె తెలుగులో బ్యూటీ, యాక్షన్ క్విన్ గా కూడా పేరు సంపాదించుకుంది. సుమంత్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన ఈమె ఘరానా అల్లుడు, తోడికోడళ్ళు, బావ బామ్మర్ది , పోలీస్ అల్లుడు, ప్రేమఖైదీ, సాహస వీరుడు సాగర కన్య వంటి పలు చిత్రాలలో సుమన్ కి జోడించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాదు కన్నడం తమిళంలో కూడా నటించి మెప్పించిన ఈమె నేడు సినీ రంగంలోకి వస్తున్న ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో సందేహం లేదు.
ఇకపోతే ఇప్పుడు ఆమె కూతురు కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది.కొత్త విషయం ఏమిటంటే తాజాగా మాలా శ్రీ కూతురు పేరు మార్చుకుంది. అనన్య, రాదన అనే పేర్లతో ఆమెను పిలిచేవారు. అయితే ఇప్పుడు తన పేరును మార్చుకుంది. ఆరాధన అని కొత్త పేరు పెట్టుకుని ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతోంది. తాజాగా మాలాశ్రీ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా తక్కువే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా మాలా శ్రీ కూతురు తన పేరును మార్చుకుంటున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
” అందరికీ నమస్కారం.. నేను మీ రాధనా రామ్ ని.. ఈరోజు నుండి నా పేరును ఆరాధనగా మార్చుకున్నాను ఇక ఈ విషయాన్ని మీకు అందించాలని అనుకుంటున్నాను. ఈ మార్పు కోసం మీ ఆశీస్సులు కోరుతున్నాను. మీ ప్రేమ , అభిమానం, మద్దతుకు నా ధన్యవాదాలు .. ఇవి ఎప్పటికీ ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన ఇన్స్టాలో రాసుకుంది. ఇకపోతే త్వరలోనే ఈమె వెండితెరకు పరిచయం కానున్న నేపథ్యంలో తన ఫోటోలను కూడా షేర్ చేసుకోగా.. ఇవి నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram