HBD Nithya Menon: బర్తడే బేబీ నిత్యామీనన్ గురించి కొన్ని విషయాలు మీ కోసం..!

-

ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళతోనే హావ భావాలు పలికించగల అతి కొద్ది మంది నటీమణులలో ఈమె కూడా ఒకరు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ బెంగళూరులో జన్మించింది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కాబట్టి ఆమె గురించి కొన్ని తెలియని ఆసక్తికర విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆఫ్ బెంగళూరులో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈమె నటిగా 8 ఏళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రంలో 1998లో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2006 16వయేట కన్నడ సినిమా 7 O Clock మూవీలో సహాయ పాత్రలో నటించింది.

1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యామీనన్ 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురం సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వెను తిరిగి చేసుకోలేదు. ఇక తెలుగులో 2011లో అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా వచ్చి అదే ఏడాది నూట్రెన్ బందు సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో 180 టైటిల్ తో విడుదలయ్యింది. మొత్తం 14 సంవత్సరాలలో 50 కి పైగా చిత్రాలలో నటించింది నిత్యమీనన్.

2019లో హిందీలో మిషన్ మంగళ సినిమాతో అక్కడ కూడా పరిచయమయ్యింది . బాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ సినిమా ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక నిత్యామీనన్ ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే ఇగోలకు పోకుండా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. గత యేడాది భీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఇకపోతే ఇన్నేళ్ల కెరియర్ లో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news