కోవిడ్ పేషెంట్ల చికిత్సకు వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ), అజిత్రోమైసిన్ అనే రెండు మెడిసిన్ల వల్ల అధిక శాతం మందిలో కరోనా నయమవుతుదని సైంటిస్టులు వెల్లడించారు. ఈ మేరకు కేరళకు చెందిన రాష్ట్ర మెడికల్ బోర్డు కోవిడ్ 19 పేషెంట్లపై చేపట్టిన ఓ క్లినికల్ స్టడీకి చెందిన వివరాలను వెల్లడించింది. సదరు రెండు మెడిసిన్ల వల్ల చాలా మంది కరోనా పేషెంట్లు ఆ వ్యాధి నుంచి బయట పడుతున్నారని తెలిపింది.
మొత్తం 500 మంది కరోనా పేషెంట్లకు సదరు రెండు మెడిసిన్లను ఇచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో 95.8 శాతం మందిలో కరోనా లక్షణాలు చాలా తక్కువగా కనిపించాయన్నారు. 500 మందిలో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. మొత్తం పేషెంట్లలో 18 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, 9.2 శాతం మందికి డయాబెటిస్ ఉండగా, 9 శాతం మందికి హైబీపీ ఉందని సైంటిస్టులు తెలిపారు.
ఆ ట్రీట్‌మెంట్ తీసుకున్న వారి సగటు వయస్సు 34 సంవత్సరాలు ఉందని తెలిపారు. అదే దేశవ్యాప్తంగా చూస్తే 37 సంవత్సరాలు ఉందని తెలిపారు. కేరళలో చాలా తక్కువ మందిలో కరోనా తీవ్రతరమవుతుందని అన్నారు. హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ మందులను వాడడం వల్ల ఎమర్జెన్సీ దశకు వెళ్లే అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఇక ఇతర మెడిసిన్లను తీసుకున్న వారు సగటున 14.45 రోజుల్లో కోలుకుంటే.. ఈ రెండు మెడిసిన్లను తీసుకున్న వారు 13.51 రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. అందువల్ల ఈ రెండు మెడిసిన్లను కోవిడ్ చికిత్సకు మరింత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.