దుబ్బాక అప్డేట్ : నాలుగో రౌండ్ లోనూ బీజీపీ ఆధిక్యం..

దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి ప్రతి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ ఉండటం అధికార టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 2684 ఓట్ల ఆధిక్యత లభించింది. నాలుగు రౌండ్లు ముగిసేసరికి ఆయన ఈ మెజారిటీతో కొనసాగుతున్నారు. చివరిగా 4వ రౌండ్ ముగియగా ఎక్కువగా అందులో 1425 ఓట్ల ఆధిక్యత లభించింది.

ప్రస్తుతం పోలైన ఓట్లు పరిశీలిస్తే టీఆర్ఎస్కు పదివేల 371 ఓట్లు అలానే బీజేపీకి 1,3055 ఓట్లు ఇక కాంగ్రెస్ కు మరియు దారుణంగా 2188 ఓట్లు పోలయ్యాయి. సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోండగా మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూర్తి ఫలితం రావచ్చని చెబుతున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మొత్తం లక్షా 98 వేల 766 ఓటర్లు ఉండగా అందులో ఓటుహక్కు వినియోగించుకున్న లక్షా 64 వేల 192 మంది ఓటర్లని ఓట్లని 23 రౌండ్లలో పూర్తిగా లెక్కించనున్నారు.