అతనికి 12 మంది భార్యలు 102 మంది పిల్లలు.. ఇప్పుడు ఫ్యామిలి ప్లానింగ్‌ కావాలట..!!

-

ఈరోజుల్లో ఒక్క పెళ్లి చేసుకోని వాళ్లను భరించటమే పెద్ద తలనొప్పిగా మారుతుంది. గొడవలు పడుతున్నారు..ఎక్కడో అరుదుగా.. రెండో పెళ్లి కూడా చేసుకుని అష్టకష్టాలు పడుతున్నారు. కానీ ఆ వ్యక్తి ఏకంగా 12మందిని చేసుకున్నాడు. 12మంది భార్యలు.. 102 మంది పిల్లలు ఉన్నారు అతనికి.. వింటుంటేనే వింతగా ఉంది.

ఆఫ్రికాలో ఉన్న ఒక వ్యక్తికి పెద్ద కుటుంబం గురించి విన్న తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయిపోయిద్ది. ఆ వ్యక్తికి మొత్తం 12 మంది భార్యలు ఉన్నారు. వారి నుండి 102 మంది పిల్లలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు కుటుంబాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ కి సమయం ఆసన్నమైందని అతను భావిస్తున్నాడు. 102 మంది పిల్లలను పెంచుతున్న ఈ వ్యక్తి వృత్తి రీత్యా రైతు కావడంతో కుటుంబ పోషణకే ఇప్పుడు ఆదాయం కరువైంది.

ఉగాండాలోని లుసాకా నగరంలో నివసించే మోసెస్ హసహాయ(Musa hasahya) అనే రైతు తన పెద్ద కుటుంబంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అతనికి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 568 మనుమలు ఉన్నారు. హైలెట్‌ ఏంటంటే.. అతని భార్యలందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అతనికి మొత్తం 102 మంది పిల్లలు ఉండగా, వారిలో 11 మంది పిల్లలు చిన్న భార్య జులేకా నుంచి కలిగినవారేనట.. మూసా పిల్లలలో మూడింట ఒక వంతు మంది అంటే.. 6, 51 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. పిల్లలందరూ అతనితో వ్యవసాయ పనులు చేస్తారు. మూసా యొక్క పెద్ద కుమారుడు మూసా 11వ భార్య కంటే 21 సంవత్సరాలు పెద్దవాడు. 102 మంది పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు మూసా.. జీవన వ్యయం ఏటా పెరుగుతోందని ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయించుకుందామనుకుంటున్నాడట..

ప్రస్తుతానికి, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పెరుగుతున్న కుటుంబ సంఖ్యను ఆపాలని మూసా నిర్ణయించుకున్నాడు. 67 ఏళ్ల మూసా ఇప్పుడు పేద ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ నియంత్రణ గురించి ఆలోచిస్తున్నాడని, అతని భార్యలు గర్భనిరోధకాలను ఉపయోగిస్తున్నారని సమాచారం. మూసా ఇద్దరు భార్యలు పేదరికం కారణంగా అతనిని విడిచిపెట్టగా, ఇప్పుడు మిగిలిన భార్యలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తున్నారు. ఉగాండాలో బహుభార్యత్వం చట్టరీత్యా నేరం కాదు. మనోడు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నట్లు ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news