మరి కాసేపట్లో న్యూయర్ వేడుకలు జరుపుకోకున్న దేశం ఏదో తెలుసా?

-

న్యూయర్ అంటే అందరూ సంబరాలు చేసుకుంటారు.. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం.. ప్రస్తుత ఏడాదికి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంది. ఈ సందర్భగా డిసెంబర్ 31న బాణసంచా కాల్చి, విందు, వినోదాల తో ఉత్సాహంగా కన్పిస్తారు జనాలు.. అసలు న్యూయర్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు..

నిజానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూయర్ వేడుకలను చేసుకోవు.. కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి. అందుకే డిసెంబర్ 31 మొత్తం 25 గంటల పాటు కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి.

న్యూ ఇయర్ వేడుకలకు ప్రాచీన చరిత్ర ఉంది. 4,000 ఏళ్ల క్రితం ఇరాక్‌లో ని బేబీలాన్ ప్రాంతం అందరికంటే ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలికేది. కాలానుగుణంగా మార్పులు రావడం తో పరిస్థితులు మారాయి. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందు 2023కు స్వాగతం పలుకుతుంది. టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ఓసియానాలోనివే. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో న్యూయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి..

మన టైం ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియానియా లో సంబరాలు ప్రారంభమవుతాయి… ఇకపోతే అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు న్యూయర్‌కు చివరగా స్వాగతం పలుకుతాయి.. మన టైం ప్రకారం.. జనవరి 1 సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రాంతం కొత్త ఏడాది లోకి అడుగు పెడుతుంది.. మిగిలిన దేశాల్లో అయితే డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు న్యూయర్ వేడుకలు జరుపుకుంటారు..

Read more RELATED
Recommended to you

Latest news