అందులో తాను భాగస్వామిని కావడం రైతు బిడ్డగా సంతోష పడుతున్న : మంత్రి పొన్నం ప్రభాకర్

-

రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.అందులో తాను భాగస్వామిని కావడం రైతు బిడ్డగా సంతోష పడుతున్నానని ఆయన తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.

రాహుల్ హామీ మేరకు కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన స్పష్టం చేశారు. విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని, విడతల వారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఏ రోజు నుంచి రుణమాఫీ అమలు అవుతుందనేది త్వరలోనే విధి విధానాలు వస్తాయి అని తెలిపారు.జీవో వస్తుందని చెప్పారు. గతంలో మాదిరిగా విడతల వారీగా రుణమాఫీ కాకుండా ఒకేసారి అవుతుందని పేర్కొన్నారు. రైతు బిడ్డగా సహచర మంత్రులకు , సీఎం ,డిప్యూటీ సీఎం, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్ మంత్రిగా అందులో భాగస్వామ్యం అయినందుకు సంతోషాన్ని ఇస్తుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news