మూడేళ్లుగా టెంటులో నిద్రించి రూ.ఏడు కోట్ల విరాళం సేకరించాడు..

-

టెంటులో పడుకుంటే విరాళాలు వస్తాయని మీకు తెలుసా..? ఓ పదేళ్ల బాలుడు.. స్వచ్ఛంద సంస్థకు నిధులు ఇవ్వడం కోసం.. మూడేళ్లు టెంటులో నిద్రపోయాడు. ఇలా చేయడం వల్ల.. దాదాపు రూ.ఏడు కోట్ల విరాళంగా వచ్చాయట. అంతా విచిత్రంగా ఉంది కదూ..! ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

 

బ్రిటన్‌కు చెందిన పదేళ్ల బాలుడు మ్యాక్స్‌ వూజీ ఇంటి పక్కనే రిక్‌ అబాట్ నివసించేవారు. ఆయన మ్యాక్స్‌ కుటుంబానికి బాగా సన్నిహితుడు. 74ఏళ్ల వయసులో క్యాన్సర్‌ కారణంగా చనిపోయారు. అంతకుముందే రిక్‌ తన దగ్గరున్న టెంట్‌(Tent)ను మ్యాక్స్‌కు ఇచ్చాడు. దీంతో ఏదైనా సాహసకార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్‌ బాగా సీరయస్‌గా తీసుకున్నాడు.. దాంతో 2020 మార్చిలో తాను ఇంట్లో కాకుండా మూడేళ్లపాటు ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నాడు.. ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7కోట్లకు చేరింది.

మ్యాక్స్‌ కృషికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా దక్కాయి. బ్రిటిష్‌ అంపైర్‌ మెడల్‌, బేర్‌గ్రిల్స్‌ చీఫ్‌ స్కౌట్‌ అన్‌సంగ్ హీరో అవార్డు, ఎ ప్రైడ్‌ ఆఫ్‌ బ్రిటన్‌ అవార్డులు అతడికి దక్కాయి.. మ్యాక్స్‌ తన మూడేళ్ల టెంట్‌ నిద్రకు ముగించేముందు ఏప్రిల్ 1న సంబరాలు చేయబోతున్నాడట…ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని మ్యాక్స్‌ వెల్లడించాడు..

టెంట్‌లో ఒకటి రెండు రోజులు పడుకోవడం అంటే ఎవరికైనా నచ్చుతుంది కానీ.. మూడేళ్లుగా రాత్రుళ్లు టెంటులో పడుకోవడం అంటే చిన్న విషయం కాదు. మంచి కార్యం కోసం.. చిన్నవయసులోనే ఆ పిల్లాడు చేసిన సాహసం చూసి ఎంతోమంది బారీ ఎత్తున విరాళాలు పంపించారు. అలా ఏడుకోట్లు పోగయ్యాయి. మ్యాక్స్‌ ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు చాలా సార్లు వెనక్కు వచ్చేయమని చెప్పినా..మ్యాక్స్‌ ఈ పని పూర్తిచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news