బ్లాక్ రైస్ తో ఎన్ని లాభాలో..! గుండెజబ్బులు, మధుమేహం తగ్గించుకోవచ్చు..బరువు కూడా

-

మనకు ధాన్యాలు ప్రధానమైన ఆహారాలు. వీటిల్లో బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఊదలు, కొర్రలు, ఆరికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రైస్ లో కూడా ఎక్కువ పోషకాలను అందించే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిండెన్ ను, హై లెవల్స్ లో కలిగిఉన్న బ్లాక్ రైస్ అనేది ఈ మధ్య ఎక్కువగా వినబడుతుంది. మార్కెట్ లో కూడా కొన్నిచోట్ల ఇవి కనిపిస్తున్నాయి. రైస్ అంటేనే అందరికి ఇష్టం. మనకు రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తెలుసు. తాజాగా ఈ బ్లాక్ రైస్ మీద పరిశోధన చేసి..ఇందులో చాలా రిచ్ యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఇది చాలా మంచిది అని నిరూపించారు. యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్కో వాళ్లు కూడా 2013 వ సంవత్సరంలో పరిశోధన చేసి అందించారు. అసలు ఇందులో ఏం ఏం ఉంటాయి, 23 రకాలుగా హై లెవల్ యాంటిఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరం జబ్బులభారిన పడకుండా రక్షించడానికి, శరీరంలో వ్యర్థాలు టాక్సిన్స్ త్వరగా క్లీన్ అవడానికి , లివర్ డీటాక్సిఫైకషన్ కు చాలా బాగా ఉపయోగపడే యాంటిఆక్సిడెంట్స్ ఈ బ్లాక్ రైస్ లో ఉన్నాయట.

100 గ్రాములు బ్లాక్ రైస్ లో ఉండే పోషకాలు
కాలరీలు 356
పిండిపదార్ధాలు 75.5 గ్రాములు
ప్రోటీన్ 9గ్రాములు
ఫ్యాట్ 3.3గ్రాములు
ఫైబర్ 2.5 గ్రాములు

బ్లాక్ రైస్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి

ఇందులో కొసర్టిన్ అనే యాంటీ ఆక్సిండెంట్స్ ఒక గ్రాము బియ్యంలోనే 190మైక్రో గ్రామ్స్ ఉంది. అంటే చాలా ఎక్కువ. అలాగే యాంతోసైనిన్ ఒక గ్రాము బియ్యంలో 1400 మైక్రోగ్రామ్స్ ఉంది. వరిజినాల్ 1 గ్రాము రైస్ లో 280మైక్రో గ్రాములు ఉంది. ఒక గ్రాము బియ్యంలోనే ఇంత ఉంటే..మనం 100-180 గ్రాములు బియ్యం తింటాం. అప్పడు మనకు ఎన్ని యాంటిఆక్సిడెంట్స్ లాభిస్తాయో ఈపాటికే మీకు అర్థం అయిపోవాలి.

ఇందులో ఉన్న వరిజనాల్ యాంటి ఆక్సిడెంట్ లివర్ డీటాక్సివికేషన్ కు అద్భుతంగా పనికొస్తుందని సైంటిస్టులు నిరూపించారు. అంటే ఆల్కాహాల్ తాగేవారికి, ఒబిసిటీ ఉన్నవారిలో ఫ్యాటిలివర్ డవలప్ అవుతుంది. ఇలాంటి వారికి లివర్ డీటాక్సిఫికేషన్ సరిగ్గా చేయలేదు. ఈ బ్లాక్ రైస్ లో ఉండే..వరిజినాల్ తో లివర్ డీటాక్సిఫికేషన్ చాలా యాక్టివ్ గా జరుగుతుందట.

ఇందులో ఉండే 23 రకాల హై లెవర్ యాంటీఆక్సిడెంట్స్ ప్రధానంగా హార్ట్ డిసీస్ రాకుండా బాగా ఫ్రీ రాడికల్స్ డామేజ్ ను హార్ట్ మీద, రక్తనాళాలా మీద జరగకుండా రక్షించిస్తాయట.

మెదడుకు అల్జీమర్స్ వ్యాధిఅనేది రాకుండా చేయడానికి,మెదడు కుషించుకుపోకుండా ఉండటానికి బ్రెయిన్ సెల్స్ బతికినన్నాళ్లు చురుగ్గా ఉండటానికి ఈ యాంటీఆక్సిడెంట్ బాగా రక్షిస్తాయి.

ఇందులో బాగా ఉండే రెండు కెమికల్ కాంపౌండ్స్.లూటిన్(lutein) మరియు జియాజాంథిన్( Zeaxanthin) ఇవి కంటిలో ఉండే రెటీనా డామేజ్ అవకుండా ఉండటానికి కాపాడతాయి. కంటిచూపు మెరుగుఅవడానికి కూడా ఈ బ్లాక్ రైస్ ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే యాంతోసైనిన్స్ (anthocyanins) వెయిట్ లాస్ అవడానికి, ఫ్యాట్ ని తగ్గించడానికి, బ్లడ్ లో గ్లూగోజ్ లెవల్ స్పీడ్ గా వెళ్లకుండా నియంత్రించడానికి ఉపయోగపడుతున్నాయి. ఆహారాలు త్వరగా కొవ్వుగా మారకుండా చేస్తాయని పరిశోధకులు అంటున్నారు.

ఈ బ్లాక్ రైస్ కొద్దిగా లావుగా ఉండటం వల్ల ఉడికనప్పుడు కూడా కొద్దిగా గట్టిగా ఉంటాయట. దాన్ని మనం తినేప్పుడు ఎక్కువగా తినలేరట. తక్కువగా తిన్నా.. ఎక్కువ ఎనర్జీ వస్తుంది, కార్భోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. ఘగర్ పెరగకుండా నియంత్రించడానికి బాగా మేలు చేస్తాయట. దీని ధర మార్కెట్ లో 300-400 అంతకన్నా ఎక్కువకు కూడా అమ్ముతున్నారు. ఇబ్బందిలేదు అనుకుంటే..కొనేందుకు ప్రయత్నించండి. జబ్బులు వచ్చినప్పుడు వేలకు వేలు ఖర్చుపెట్టేస్తాం..ముందు నుంచే వీటిని తింటూ ఉంటే..ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా..దీంతో అంబలి, జావ, రవ్వ చేసుకుని టిఫెన్ లో కూడా వాడుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news