అందరికీ అందుబాటులో ఉండేవి గుడ్లు అనిచెప్పవచ్చు. అన్ని రకాల ప్రొటీన్లు ఇందులోనే దొరకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని రెగులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుందంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలుసుకుందాం.
– ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయం నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధన చెబుతున్నది.
– చాలామందికి గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందని అనుకుంటారు. దీంతో గుడ్డు తినడం మానేస్తారు. కానీ అది అపోహ మాత్రమే.. వాస్తవానికి గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండవు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్ ఉంటుందిగానీ అదొక్కటే కాదు. అందులో విటమిన్-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నే ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి అలాంటి వారు పచ్చసొనని తీసేసి తెల్లదాన్ని తింటే సరిపోతుంది.
– ఏ సమస్యాలేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు. రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది. గుడ్డుని తినడం వల్ల కండరాలు దృఢంగా అవుతాయి. గర్బవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. రోజుకి ఒక గుడ్డును ఆహారంలో తీసుకుంటే శరీరానికి మేలు చేసే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.