వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా..!

-

స‌హ‌జంగా వెల్లుల్లిని వంట‌ల్లో విరివిరిగా వాడుతుంటాం. నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని, అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడేందుకు ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది. ఉదయం లేచిన వెంటనే పరగడుపున వెల్లుల్లి తింటే దాదాపు అన్ని అనారోగ్యాలకు దూరం అవ్వొచ్చు.

ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ, ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు కీల‌క‌మైన‌ది. వెల్లుల్లి వ‌ల్ల ఆరోగ్యానికి పలు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

– వెల్లుల్లిలో ల‌భించే హైడ్రోజన్‌ సల్ఫేట్‌, నైట్రిక యాసిడ్‌ రక్తనాళాల ఉపశమనానికి దోహదపడతాయి. మ‌రియు రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది.

– శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించ‌డంలో వెల్లుల్లి ఉప‌యోగుప‌డుతుంది. రోజూ వెల్లుల్లి టీ తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చేస్తుంది.

– వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.

– ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం, 2 స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ఆస్త్మా నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

–  వెల్లుల్లి పెద్దప్రేగు క్యాన్సర్, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది.

–  వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే  జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం నివారిస్తుంది.

– వెల్లుల్లిలో విటమిన్‌ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఉబ్బసం, కడు పులో నులిపురుగుల నివారణకి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news