పెసర గింజల తో అనేక రకాల వంటలని చెయ్యొచ్చు. ఎలా ఉపయోగించిన చాల లాభాలు ఉంటాయి. పప్పు ధాన్యాల లో ఒకటైన ఈ పెసరని ఆహారంగా తీసుకునే చాల బెనిఫిట్స్ కలుగుతాయి. మన శరీరానికి కావలసిన పోషక విలువలు దీని ద్వారా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం దీని వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.. ఉడికించిన పెసర గింజల లో అధిక మొత్తం లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. అలానే మొలకలు వచ్చిన పెసర గింజల లో ఉండే ఎంజైములు యాంటీ ఆక్సిడెంట్లు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
ఇలా ఈ పోషక విలువలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. అలానే ఇది పిల్లల ఎదుగుదలకు ఎంత గానో సహకరిస్తాయి. యవ్వనంగా కనిపించాలంటే కూడా ఆహారం లో పెసర పప్పుని తీసుకుంటే చాలు. రక్త పోటు తో సతమతం అయ్యే వారు పెసర పప్పును ఉడికించి కొద్దిగా ఉప్పు కలుపుకొని తీసుకోవటం వల్ల రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
అలానే ఇది జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. పెసరపప్పు లో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న ఐరన్ శరీరానికి కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేయడం లో కూడా సహాయ పడుతుంది. ఇలా దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్ లో చేర్చాల్సిందే కదా…!