సిఎంకు షాక్ ఇచ్చిన మరో మంత్రి, కేబినేట్ పదవికి రాజీనామా…?

-

బెంగాల్ మంత్రి రాజీబ్ బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సిఎం మమతా బెనర్జీ మంత్రివర్గానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీబ్ బెనర్జీ బెంగాల్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేసారు. “పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేయడం గొప్ప గౌరవం మరియు హక్కు. ఈ అవకాశం లభించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అన్నారు.

రాజీనామాతో పాటుగా షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాజీబ్ బెనర్జీ “నేను మీలో ప్రతి ఒక్కరినీ నా కుటుంబంగా భావించాను. మీ మద్దతు ఎల్లప్పుడూ నన్ను ముందుకు వెళ్ళడానికి మీ సేవలో మంచి మార్గంలో ఉండటానికి నన్ను ప్రేరేపించింది. అందువల్ల నేను ఈ వేదికపై నా అధికారికంగా రాజీనామాను ప్రకటిస్తున్నాను.” అని అన్నారు. ఇక నిన్న టిఎంసి నాయకత్వానికి మరియు ముఖ్యంగా మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉన్న బెంగాలీ నటుడు రుద్రానిల్ ఘోష్,

బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆయన బిజెపిలో జాయిన్ అవుతారా లేక ఏంటీ అనేది స్పష్టత లేదు. అయితే బిజెపిలో చేరుతున్న తృణముల్ కాంగ్రెస్ నేతల సంఖ్య పెరుగుతుంది. దక్షిణ కోల్‌కతాలో బుధవారం రాత్రి జరిగిన సామాజిక కార్యక్రమంలో బిజెపి నాయకుడు సువేందు అధికారి, అధికార పార్టీ సభ్యురాలు నటి రింజిమ్ మిత్రాతో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం టిఎంసి నేత అరిందం భట్టాచార్య బిజెపిలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news