రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి కిడ్నీలు ( Kidney ). కిడ్నీలు మెరుగ్గా పని చేయడం అత్యవసరం. కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ విధంగా చెయ్యండి. దీనితో మీ కిడ్నీలు బాగా పని చేస్తాయి మరియు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మరి ఇక కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు గురించి చూసేద్దాం.
వెల్లుల్లి :
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక వంటల్లో ఎక్కువగా వెల్లుల్లి వాడితే మంచిది. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపించేయడానికి కూడా తోడ్పడుతుంది. అలానే వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఆపిల్:
ఆపిల్ పండ్ల వలన కూడా మనకి చక్కటి పోషకాలు అందుతాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం ఇలా ఎన్నో లాభాలు పొందచ్చు.
నీళ్లు ఎక్కువ తాగాలి:
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ నీరు తాగాలి. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురవద్దు. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగుల్లో విటమిన్-బి, విటమిన్ డి సమృద్ధిగా వున్నాయి. ఇవి కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తి తో పాటు ఎన్నో ప్రయోజనాలు పుట్టగొడుగులుతో మనం పొందొచ్చు. ( ఇలా ఈజీగా మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారుచేసుకోండి..! )
ఓట్స్:
ఓట్స్ లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. కనుక రెగ్యులర్ గా ఓట్స్ తీసుకున్నా చక్కటి లాభాలు పొందొచ్చు. కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.