ఈ సమస్యలు ఉంటే పుట్టగొడుగులతో చెక్ పెట్టేయండి…!

-

పుట్టగొడుగులతో అనేక వంటలు చేసుకోవచ్చు. చాలా మందికి పుట్టగొడుగులు తో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టం. అయితే కేవలం రుచికి మాత్రమే కాదు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శాఖాహారం అయినా ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారం కనుక మీరు తినక పోయినట్లయితే పుట్టగొడుగులు తప్పనిసరిగా మీరు మీ డైట్ లో తీసుకోండి. దీని వల్ల మీకు అనేక పోషకాలు ఎంతో సులువుగా వస్తాయి. అయితే పుట్టగొడుగుల వలన ఎటువంటి పోషకాలు లభిస్తాయి…?, దీని వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి…? ఇలా అనేక విషయాలు మీ కోసం. ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.

అనీమియాతో బాధపడే వారికి రక్తం లో ఐరన్ తక్కువగా ఉంటుంది. దీని మూలంగానే తలనొప్పి, ఆయాసం, జీర్ణ వ్యవస్థలో సమస్యలు వంటివి తలెత్తుతాయి. అయితే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు పుట్టగొడుగులను తీసుకోవడం చాలా మంచిది. దీని వలన మీకు ఐరన్ అందుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్లకి కూడా ఇది మంచి ఆహార పదార్థం. కనుక దీనిని తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు కరిగి ప్రోటీన్స్ జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గవచ్చు.

మష్రూమ్స్ లో బీటా గ్లూకాన్ కూడా ఉంటుంది. అలానే కాంజుగేట్ లినోలిక్ ఆసిడ్ వంటివి ఉండడం వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. షుగర్ తో సతమతమయ్యే వాళ్లు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీనిలో కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్స్, శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. నీళ్లు, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర స్థాయిని అదుపులో చేయడానికి బాగా సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడే పొటాషియం దీనిలో లభిస్తుంది. కండరాలు ఉత్తేజితం చేస్తుంది కూడా.

Read more RELATED
Recommended to you

Latest news