గుండెకి సంబంధించిన సమస్యలన్నీ వృద్ధాప్యంలోనే వస్తాయనుకుంటే పొరపాటే. ఒకప్పుడు అది నిజమే. కానీ మారుతున్న కాలంలో మారుతున్న జీవన విధానాల వల్ల యువకుల్లోనూ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, మానసికంగా బలహీనపడడం మొదలగునవన్నీ గుండె సమస్యలకి దారి తీస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. గుండెకి సంబంధించిన సమస్యలో అతి ముఖ్యమైనది హార్ట్ అటాక్.
గుండెకు నుండి రక్తనాళాలకి వెళ్ళే రక్తం సరిగ్గా చేరక కణాలకి శక్తి అందదు. దానివల్ల తొందరగా అలసిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు వంటి ఇబ్బందులు వస్తాయి. ఇంకా శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఏర్పడి హార్ట్ అటాక్ సంభవిస్తుంది. ఇలాంటి విపరీతాలకి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా అధిక ఒత్తిడి. రోజుల తరబడి ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటే చివరికి అది గుండె సంబంధిత సమస్యలని తెచ్చి పెడుతుంది.
గుండె సమస్యలకి కారణాలు
పొగ తాగడం
హై బీపీ
చక్కెర వ్యాధి
గుండె నాళాలు సరిగ్గా లేకపోవడం
ఈ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడితే అవి రోజు వారి దినచర్యని బాగా ప్రభావితం చేస్తాయి. నడవడం, పరుగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి కష్టం అవుతుంటాయి. గుండెకి సంబంధించిన సమస్యలని రివర్స్ చేయలేము. దీనిలో ముఖ్యంగా నాలుగు స్టేజిలు ఉంటాయి. మొదటి స్టేజిలో ఉంటే మన జీవన విధానాలని మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం మొదలగునవి బాగా పనిచేస్తాయి. మిగతా ముడు స్టేజిల్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.