BREAKING : పుట్టపర్తి ఎమ్మెల్యేకు గుండెపోటు.. !

-

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపి పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి గుండె పోటు వచ్చినట్లు సమాచారం అందుతోంది. నిన్న రాత్రి వరకు బాగానే ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. ఒక్కసారిగా చాతి నొప్పి తో కింద పడిపోయినట్లు సమాచారం అందుతోంది.

దీంతో ఆందోళనకు లోనైన నా ఆయన కుటుంబ సభ్యులు.. అలాగే… కార్యకర్తలు వెంటనే… హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.

అంతే కాదు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుందని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కాస్త టెన్షన్ కు లోనుకావడం కారణంగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా మొన్నటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చాలా చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news