మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం తెల్లవారు జామున ఓ కారు షెడ్డులో మంటలు వ్యాపించినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 8 కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
స్థానిక పోలీసులు సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయగా.. షార్ట్ సర్య్కూట్ వల్లే అగ్నిప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మంటలు వ్యాపించిన టైంలో చుట్టుపక్కల ఉన్న దుకాణ సముదాయాలు సైతం స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. మంటలను త్వరగా అదుపులోకి తీసుకుని రావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.