జమ్మూకశ్మీర్ వర్షం బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా అక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరదలు పోటెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకున్నారు. పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు అధికారులు. అయితే.. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. భారీ వర్షం, వరద నేపథ్యంలో సైనికులు, ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.