విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా వైసీపీ ప్లీనరీ వేడుకలు గుంటూరులో జరుగుతున్నాయి. అయితే నేడు తొలి రోజు ప్లీనరీలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. అంతేకాకుండా తనకు వైఎస్‌ షర్మిల చెందిన వైఎస్సార్‌టీపీ పార్టీలోనూ సభ్యత్వం ఉండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఈ నేపథ్యంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. వైఎస్ విజ‌య‌మ్మ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న చెల్లి ష‌ర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ వెళ్లిపోయింద‌ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అంద‌రినీ వాడుకుంటాడు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. చీక‌టి పాల‌న వ‌ద్దూ చీక‌టి జీవోలు వ‌ద్దంటూ
వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version