బెంగళూరులో కుండపోత.. భారీగా వరద నీరు !

-

మొన్నటి దాకా హైదరాబాద్ అంతు చూడాలని చూసిన భారీ వర్షం ఇప్పుడు బెంగళూరు మీద పడింది. బెంగళూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునగగా ట్రాఫిక్‌ కు అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సౌత్ బెంగళూరులోని చాలా ప్రాంతాలు వర్షానికి నీట మునిగాయి. నిన్న మధ్యాహ్నం 2.30 నుండి 5.30 దాకా భారీ వర్షం నమోదయింది. ఈ వర్షం కారణంగా సౌత్ బెంగళూరులోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్ట పోయాయి.

కోరమంగళ,బీటీఎం లే అవుట్, జయనగర, బవసనగుడి, ఆర్ఆర్ నగర్, కెంగెరి, మల్లేశ్వరం ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ఓ చోట మురుగు నీటి కాలువ ఉప్పొంగడంతో ఓ కారు అందులో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలాచోట్ల అపార్ట్‌మెంట్లు,ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కూడా నీట మునిగాయి. ఇక రాబోయే 24గంటల్లో బెంగళూరు,చుట్టు పక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news