కర్నూల్ జిల్లాలో దారుణ గ్యాంగ్ రేప్ అంటూ ఫిర్యాదు.. నిజమేనా?

-

కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో నిన్న ఒక దారుణ గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులకి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఓ 15 ఏళ్ళ బాలిక మీద ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని ఆ తర్వాత నోట్లో పురుగు మందు పోసి పరారయ్యారని చెబుతూ ఫిర్యాదు చేశారు.

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని గుర్తు పట్టకుండా మొహానికి నల్లరంగు పూసుకున్నారని ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఆ బాలిక మీద అత్యాచారం జరగలేదని, పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారని డోన్ డీఎస్పీ పేర్కొన్నారు. అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు ఫిర్యాదు చేశారని ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news