వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికొండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది.
దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా నడుస్తుండటంతో అకాల వర్షం పార్టీల ప్రచారానికి ఆటంకంగా మారింది. ఈ రోజు వైసీపీ పార్టీ తరఫున సీఎం జగన్ సిద్ధం సభ ఏటుకూరు వద్ద జరగనుంది. కాగా అక్కడ కూడా భారీ వర్షం కురవడంతో సిద్ధం సభ నిర్వహణపై నీలినీడలు అలముకున్నాయి. అలాగే వర్షం సమయంలో భారీగా విచిన ఈదురు గాలుల వల్ల సభ కోసం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, పెక్సీలు నేలమట్టం అయ్యాయి.