కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఇవాళ కోర్టు కొట్టివేసింది. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తందని కవిత అవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు.
జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీ సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేసి తాజాగా తీర్పు వెల్లడించింది కోర్టు. కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఈనెల 15 వరకు సీబీఐ కస్టడీలో ఉండనుంది. ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు.