హైదరాబాద్ లో భయంకర వాతావరణం…!

-

గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో భారీ ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు కాస్త వర్షం ఉపశమనం ఇచ్చింది. హైదరాబాద్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది అని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి, మాదాపూర్ , హైటెక్ సిటీ లో వర్షం కురుస్తుంది. నిజాంపేట్, కూకట్ పల్లి, మణికొండ, ఫిలిం నగర్ లో వర్షం కురుస్తుంది అని అధికారులు వెల్లడించారు.

మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షం పడుతుంది. డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసి కమిషనర్.. ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి ముందుకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు పర్యటించాలని ఆదేశించారు. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version