ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ వర్షం…!

హైదరాబాద్‌ నగరం లో ని పలు ప్రాంతా ల్లో… భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌ నామా, లాల్‌ దర్వాజ, చాంద్రయణ గుట్ట, యాఖత్‌ పురా, బహదూర్‌ పురా, అఫ్జల్‌ గంజ్‌ మరియు మొజంజాహీ మార్కెట్‌ పాటు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చిరు జల్లుల మధ్య గణేష్‌ శోభయాత్ర విజయ వంతంగా కొనసాగుతోంది.

ఇవాళ భాగ్య నగరం లో పెద్ద ఎత్తున గణేషుడి నిమజ్జనం జరుగుతున్న నేపథ్యం లో వర్షం లోనే గణనాథులు ఊరేగింపు సాగుతోంది. ఇక మరి కాసేపట్లోనే… ఖైరతా బాద్‌ వినాయకుడు… టాంక్‌ బండ్‌ దగ్గరకు చేరుకోనున్నాడు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ దగ్గర గణేషుడు ఉన్నాడు. ఇక అటు ఖైరతా బాద్‌ విగ్రహం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు…. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.