ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు ఎల్లో జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఏలూరు, అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఉభయగోదావరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

నిన్న శ్రీకాకుళంలో 16 సెంటీమీటర్ల వర్షం కురవగా… కలింగపట్నంలో 13.3 సెంటీమీటర్ల వర్షం… వైజాగ్ లో 11.8 సెంటీమీటర్ల వర్షం నమోదు అయినట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచనలు జారీ చేశారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు మెరిసే అవకాశాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాలలో నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.