ముంబైలో భారీ వ‌ర్షం.. ట్రాఫిక్ జాంలు, వ‌ర‌ద‌నీటితో జ‌నాల ఇబ్బందులు..!

-

దేశ వాణిజ్య న‌గ‌రం ముంబైలో  ఈ రోజు నుంచి భారీ వ‌ర్షాలు కుర‌వనున్నాయి. ఇవాళ ఉద‌యం అక్క‌డ ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. రానున్న 24 నుంచి 36 గంట‌ల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

వర్షాకాలం ప్రారంభ‌మై రుతు ప‌వ‌నాలు వ‌చ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు ప‌త్తా లేవు. కానీ దేశ వాణిజ్య న‌గ‌రం ముంబైలో మాత్రం ఈ రోజు నుంచి భారీ వ‌ర్షాలు కుర‌వనున్నాయి. ఇవాళ ఉద‌యం అక్క‌డ ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. అయితే ఆ చిన్న‌పాటి వ‌ర్షానికే రోడ్లు చెరువుల‌ను త‌ల‌పించాయి. ర‌హ‌దారుల‌పై పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు చేరి వాహ‌న‌దారుల రాక‌పోల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది.

ముంబైలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కార‌ణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. అక్క‌డి జుహు, ములుంద్‌, విలె పార్లె ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డింది. అలాగే స‌మీపంలోని థానే, వ‌సై, విరార్‌లోనూ ఇవాళ ఉద‌యం వ‌ర్షం కురిసింది. అయితే వ‌ర్షం కార‌ణంగా వేసవి తాపం నుంచి జ‌నాలు ఉప‌శ‌మ‌నం పొందిన‌ప్పటికీ ముంబైలోని డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా ఉన్నందున అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరి జ‌నాల‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తోంది. అక్క‌డి ధ‌ర‌వి, వెస్ట‌ర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే ఏరియాల్లో నీరు చేరినందున వాహ‌న‌దారులు రోడ్ల‌పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంల‌లో నిరీక్షించాల్సి వ‌స్తోంది.

అయితే వ‌ర్షాల కార‌ణంగా లోక‌ల్ ట్రెయిన్‌, విమాన స‌ర్వీసుల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌లేదు. అవి సాధార‌ణంగానే న‌డుస్తున్నాయి. కానీ రానున్న 24 నుంచి 36 గంట‌ల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్ర‌జాజీవ‌నానికి మ‌రింత ఇబ్బంది క‌ల‌గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అయితే వ‌ర్షం కార‌ణంగా ర‌హ‌దారుల‌పై పెద్ద ఎత్తున నీరు చేర‌డం, ట్రాఫిక్ జాంలు.. త‌దిత‌ర అంశాల‌పై నెటిజన్లు సోష‌ల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ పోస్టులు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version